ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడకుండానే.. బీసీసీఐ కొత్త బాస్ గా మిథున్ మన్హాస్..

ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడకుండానే..  బీసీసీఐ కొత్త బాస్ గా  మిథున్ మన్హాస్..

ఢిల్లీ మాజీ కెప్టెన్, డొమెస్టిక్ క్రికెట్ గ్రేట్ మిథున్ మన్హాస్  బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు.  సెప్టెంబర్ 28న బీసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో  45 ఏళ్ల మన్హాస్  బోర్డు 37వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.ఒక్కటే నామినేసన్ దాఖలు కావడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆగస్టులో రాజీనామా చేసిన రోజర్ బిన్నీ స్థానంలో ఆయన నియమితులయ్యారు. మరోసారి బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ గా రాజీవ్ శుక్లా ..  బీసీసీఐ కార్యదర్శిగా దేవజిత్ సైకియా ఎన్నికయ్యారు. 

 మన్హాస్ కు  కేంద్రమంత్రి జితేంద్ర సింగ్  తన ఎక్స్ లో విషెస్ చెప్పారు.బీసీసీఐ కొత్త ప్రెసిడెంట్ గా మన్హాస్ ఎంపికయ్యారు.   జమ్మూ కాశ్మీర్‌లోని మారుమూల ప్రాంతాలలో ఒకటైన దోడా జిల్లాకు  ఇవాళ దివ్యమైన( ఆదివారం) రోజు. ఇది  నా సొంత జిల్లా కూడా కావడం యాదృచ్ఛికం అని తెలిపారు.  

సుదీర్ఘ దేశవాళీ కెరీర్‌‎లో 157 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు, 130 లిస్ట్-ఎ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లతో పాటు 55 ఐపీఎల్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడిన అనుభవం మన్హాస్‌‌‌‌‌‌‌‌కు ఉంది. మన్హాస్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 1714 పరుగులు సాధించాడు, వాటిలో 27 సెంచరీలు ఉన్నాయి, వీటిలో 4126 పరుగులు ఉన్నాయి. మన్హాస్ భారత్ జట్టు తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఢిల్లీ క్రికెట్ వర్గాల్లో మన్హాస్‌‌‎కు తెలివైన, చాకచక్యంగా వ్యవహరించే వ్యక్తిగా పేరుంది.  సరైన సమయంలో సరైన చోట ఉండటం మన్హాస్ కెరీర్‌‌లో ప్లస్‌‌ పాయింట్స్ అని అతనికి దగ్గరగా ఉండే వాళ్లు చెబుతుంటారు. 

►ALSO READ | వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌‌షిప్‌‎లో తెలంగాణ అమ్మాయి జీవాంజి దీప్తికి రజతం

తన కెరీర్ ఆరంభంలో దివంగత అరుణ్  జైట్లీకి దగ్గరగా ఉండటం, సెహ్వాగ్, యువరాజ్ సింగ్ వంటి టాప్ ప్లేయర్లతో స్నేహం చేయడం వంటివి అతనికి కలిసొచ్చాయి. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక మిథున్ జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌‌ను చక్కదిద్దేందుకు పరిపాలనా బాధ్యతలు చేపట్టాడు.