
టెలికాం మార్కెట్లో నువ్వా నేనా? అంటూ పోటీపడుతోన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ, ఎయిర్ టెల్‌కు చెందిన సునిల్ మిట్టల్ లు… ఎంటర్ టైన్‌మెంట్ రంగంలోనూ పోటీకి సై అన్నారు . సంక్షోభంలో చిక్కుకున్న సుభాష్ చంద్రకు చెం దిన జీ ఎంటర్ టైన్‌మెంట్ ఎంటర్ ప్రైజస్ ను కొనుగోలు చేసేం దుకు వీరిద్దరూ ముందుకు వచ్చారు. జీ ఎంటర్ టైన్‌మెంట్ లో వాటాలు కొనేందుకు భారతీ ఎయిర్ టెల్ కూడా ప్రయత్నాలు ప్రారంభించిందని బ్లూ మ్ బర్గ్ రిపోర్టు చేసింది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశాలున్నాయి . రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కూడా జీ లోవాటాల కొనుగోలుకు బిడ్డింగ్ వేసేందుకు సిద్ధంగా ఉందని బ్లూమ్ బర్గ్ తెలిపింది. చర్చలు ప్రాథమిక దశలో ఉన్నావని సంబంధిత వర్గాలు తెలిపాయి.
సోనీ, కామ్‌కాస్ట్ కూడా…
జీ ఎంటర్ టైన్‌మెంట్ లో వాటాలు కొనేం దుకు అంతకముం దు కూడా సోనీ పిక్చర్స్, కామ్ కాస్ట్‌లు పోటీపడుతున్నట్టు రిపోర్టులు వచ్చాయి . తాజాగా ముఖేష్ అంబానీ, సునిల్ మిట్టల్ లకు కూడా జీలో వాటాలు కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించినట్టు బ్లూమ్ బర్గ్ తెలిపింది. ఇరువురికి ఇప్పటికే టెలికాం మార్కెట్ లో తీవ్ర పోటీ ఉంది. టెలికాం రంగంలోకి ముఖేష్ ప్రవేశిం చిన తర్వాత, జియో ద్వారా పలు సంచలనాలను సృష్టిం చారు. ఆ దెబ్బకు టెలికాం మార్కెట్ లో అగ్రగామిగా ఉన్న భారతీ ఎయిర్ టెల్ కుదేలైంది. దీంతో జియోకు ఎలాగైనా చెక్ పెట్టాలని మిట్టల్ భావిస్తున్నారు .
టెలికాం అనంతరం ఈకామర్స్, ఎంటర్ టైన్‌మెంట్ రంగంలోనూ తన ముద్ర వేయాలని జియో ప్లాన్ వేసింది. ఈ క్రమంలో భాగంగా ఎస్సెల్ గ్రూప్ విక్రయిస్తోన్న జీఎంటర్ టైన్‌మెంట్ లో వాటాలను చేజిక్కించుకోవాలని చూస్తోంది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎస్సెల్ గ్రూప్ ప్రమోటర్ సుభాష్ చంద్ర జీ ఎంటర్ టైన్‌మెంట్ ఎంటర్ ప్రైజస్ లో సగం వాటాలను అమ్మనున్నట్టు ప్రకటించారు. ప్రపంచంలో అతిపెద్ద టెలికమ్యూనికేషన్స్ కంపెనీలు ఏటీ అండ్ టీ ఇంక్, వొడాఫోన్ గ్రూప్ పీఎల్ సీ, కేడీడీఐ కార్ప్ వంటివి ఫిల్మ్, టెలివిజన్ ప్రొడక్షన్, కేబుల్ టీవీ ఆస్తులను కొనుగోలు చేస్తున్నాయి . ఈ కొనుగోళ్లతో కంటెం ట్ ను సేకరిం చి ఇంటర్నెట్ ద్వారా ప్రొగ్రామింగ్ ఆఫర్ చేస్తున్నాయి . నెట్ ఫ్లి క్స్ ఇంక్, అమెజాన్.కామ్ ఇంక్ ప్రైమ్ సర్వీసులకు ఇవి పోటీగా నిలుస్తున్నాయి .