MiXup Teaser: వామ్మో.. హాట్ సీన్స్ హద్దులు దాటేశాయి.. హీటేక్కిస్తున్న మిక్సప్ టీజర్

MiXup Teaser: వామ్మో.. హాట్ సీన్స్ హద్దులు దాటేశాయి.. హీటేక్కిస్తున్న మిక్సప్ టీజర్

ఓటీటీలు ఆధారణలోకి వచ్చాక బోల్డ్ కాన్సెప్ట్ కు ఆధారణగా బాగా పెరిగింది. అడల్ట్ కంటెంట్ తో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తున్నాయి ఓటీటీ సంస్థలు. ఇప్పటివరకు కేవలం హాలీవుడ్, బాలీవుడ్ లోనే ఎక్కువగా కనిపించిన ఇలాంటి సిరీస్ లు ఇప్పుడు తెలుగులో కూడా వస్తున్నాయి. తాజాగా అలాంటి బోల్డ్ సిరీస్ తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తోంది. అదే మిక్సప్(MiXup). ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో రానున్న ఈ సిరీస్ లో ఆదర్శ్, కమల్ కామరాజు, అక్షర గౌడ, పూజ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 

తాజాగా ఈ సిరీస్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ చాలా బోల్డ్ అండ్ అడల్ట్ కంటెంట్ తో ఉంది. నాకు మూడ్ రావాలంటే ఎక్సైట్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి అనే డైలాగ్‌తో మొదలైన టీజర్ అంతా హాట్ హాట్ విజువల్స్ తో నిండిపోయింది. ఒక్క సెకన్ల కూడా గ్యాప్ లేకుండా లిప్ లాక్స్, రోమాంటిక్ సీన్స్ తో టీజర్ ను నింపేశారు. దీంతో ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక టీజర్ చూసిన ఆడియన్స్ అవాక్కవుతున్నారు. ఆహాలో ఈ రేంజ్ బోల్డ్ కంటెంటా. సీన్స్ కాస్త హద్దులు మీరాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.     

ఇక మిక్సప్ సిరీస్ మార్చ్ 15 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు మేకర్స్. మరి అవుట్ అండ్ అవుట్ అడల్ట్ కంటెంట్ తో వస్తున్న ఈ సిరీస్ ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.