
టెక్సాస్: అమెరికాలోని ఆస్టిన్‌లో హైదరాబాద్ వాసి మృతి చెందాడు. మియాపూర్‌కు చెందిన మాదినేని సాయి ప్రవీణ్‌కుమార్ ఈతకు వెళ్లి దురదృష్టవశాత్తూ చనిపోయాడు. ఈనెల 18న తన స్నేహితులతో కలసి జలపాతంలో ప్రవీణ్ ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. ప్రవీణ్ స్వస్థలం గుంటూరు జిల్లా, అత్తులూరు. అమెజాన్ సంస్థలో అతడు పని చేస్తున్నాడు. ప్రవీణ్ తల్లిదండ్రులు మియాపూర్‌లో ఉంటున్నారు.