
మియాపూర్ ఎస్సై గిరీష్‌కుమార్‌ను సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి సస్పెండ్ చేశారు. ఓ కేసు విషయంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళ విషయంలో అసభ్యంగా ప్రవర్తించాడని ఎస్సై గిరీష్‌కుమార్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన కమిషనర్ .. ఎస్సై గిరీష్‌కుమార్ ను సస్పెండ్ చేశారు.
2020 బ్యాచ్‌కు చెందిన ఎస్సై గిరీష్‌కుమార్ మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పని చేస్తున్నాడు. అయితే బ్యూటీషియన్‌గా పని చేస్తున్న ఓ మహిళ చీటింగ్ కేసు విషయంలో స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఎస్సై దానిని సాల్వ్ చేసి సదరు మహిళకు డబ్బును రికవరీ చేయించారు.
కేసు క్లోజ్ అయినప్పటికీ ఎస్సై సదరు మహిళకు నిత్యం ఫోన్ చేసి అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. దీంతో విసిగిపోయిన . బాధితురాలు సీపీకి నేరుగా ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేసిన అవినాష్ మహంతి గిరీష్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.