
మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం11.15 గంటల సమయానికి ప్రతిపక్ష జెడ్పీఎం 26 సీట్లతో సగం మార్కును అధిగమించగా.. అధికార ఎంఎన్ఎఫ్ (MNF) కేవలం 10 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. బీజేపీ 3 స్థానాల్లో, కాంగ్రెస్ 1 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. సీఎం జోరంతంగా వెనుకంజలో ఉన్నారు.
40 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎర్లీ ట్రెండ్స్‌లో సెర్చిప్ నియోజకవర్గం నుంచి ZPM అభ్యర్థి లాల్దుహోమా ముందంజలో ఉన్నారు.. ఉదయం 10 గంటలకు ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం ఆయన 1390 ఓట్ల ఆధిక్యంతో ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు లాల్దుకు 4423 ఓట్లు పోలయ్యాయి.