పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పిస్తాం: ఎంకే స్టాలిన్

పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పిస్తాం: ఎంకే స్టాలిన్

పుదుచ్చేరి ప్రజలంటే తనకు ప్రత్యేక అభిమానం ఉందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. పుదుచ్చేరి ప్రజల అభ్యున్నతి కోసం డీఎంకే, కాంగ్రెస్‌ కూటమి పనిచేస్తుందని తెలిపారు. ఏప్రిల్ 7వ తేదీ ఆదివారం పుదుచ్చేరిలో స్టాలిన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. . పుదుచ్చేరి అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. గవర్నర్లను ఉపయోగించుకుని ప్రతిపక్ష అధికార రాష్ట్రాలనే కాకుండా అధికార పార్టీని కూడా బీజేపీ ఇబ్బందులకు గురిచేస్తుందని చేస్తోందని మండిపడ్డారు. పుదుచ్చేరిలో సీఎం ఎన్ రంగసామిపై తీవ్ర ఒత్తిడి తెస్తోందని బీజేపీపై ఫైరయ్యారు. 

రాష్ట్ర హోదా ఇవ్వని కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారన్నారని విమర్శించారు. వైతిలింగం నుండి కాంగ్రెస్ అభ్యర్థిని పరిచయం చేయాల్సిన అవసరం లేదని.. గత ఎన్నికల కంటే ఎక్కువ మెజార్టీతో ఆయన గెలవాలన్నారు.  పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పిస్తామని డీఎంకే, కాంగ్రెస్‌ల ఎన్నికల మేనిఫెస్టోలో హామి ఇచ్చామని.. జూన్ 4న భారత కూటమి విజయం సాధించిన తర్వాత రాష్ట్ర హోదా ఇస్తామని స్టాలిన్ చెప్పారు.