నీట్ వివాదంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. మెరిట్ కు కొలమానమైన నీట్ పరీక్షి పేపర్ లీక్ ఆరోపణలతో దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న క్రమంలో స్టాలిన్ స్పందిస్తూ నీట్ పరీక్ష జరుగుతున్న విధానం అసమానతలను ఎత్తిచూపుతుందన్నారు. వేల సంవత్సరాలుగా విద్య నిరాకరించినబడిన సమాజం లో అణగారిన వర్గాల అభ్యున్నతికోసం మరిన్ని అవకాశాలు కల్పించాల్సిన సమయంలో దీనికి విరుద్ధంగా NEET పరీక్షలో అవకతకలు పేదలకు ఉన్నత విద్యను దూరం చేస్తున్నాయన్నారు.
గత కొంత కాలంలో నీట్ పరీక్ష నిర్వహణపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్విజిలేటర్లు OMR షీట్లను ట్యాంపరింగ్ చేశారనే ఆరోపణలతో గుజరాత్ పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. కోట్ల రూపాలయలు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇందులో ఓ పాఠశాల హెచ్ఎం, భౌతిక శాస్త్ర టీచర్ , కోచింగ్ సెంటర్లను ఇరికించారు. కేంద్ర ప్రభుత్వం ఈ విద్యార్థి వ్యతిరేక , సామాజిక న్యాయం , పేదల వ్యతిరేక నీట్ వ్యవస్థను సమర్ధించడం ఆపాలని స్టాలిన్ అన్నారు.
సుప్రీంకోర్టు ఏం చెప్పింది.
నీట్ -యూజీ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ విచారణకు దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం (జూన్ 14) స్వీకరించింది. కేంద్రం, నేషనల్ టెస్టింట్ ఏజెన్సీ(ఎన్ టీఎ) కి నోటీసులు జారీ చేసింది. అయితే కౌన్సెలింగ్ ప్రక్రియను నిలిపివేయడానికి నిరాకరించింది. NEET-UG వివాదంపై అన్ని కేసులను హైకోర్టులనుంచి తనకు బదిలీ చేయాలని ఎన్టీఏ చేసిన అభ్యర్థనను జూలై 8న విచారించడానికి కోర్టు అంగీకరించింది.