రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొంటాం : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌

రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొంటాం : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌

వేములవాడరూరల్/కోరుట్ల, వెలుగు: రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొంటామని ప్రభుత్వ విప్‌‌‌‌‌‌‌‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, జగిత్యాల జిల్లా కథలాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలకేంద్రంలో మక్కజొన్న కొనుగోలు సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  ఆయన గురువారం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు అధికారుల సూచన మేరకు వడ్లలో తేమ 17 శాతం ఉండేలా చూసుకోవాలన్నారు. మహిళలు ముందుకు వస్తే రైస్ మిల్లులు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామన్నారు. ఏ గ్రేడ్‌‌‌‌‌‌‌‌ రకం మొక్కజొన్న క్వింటాలుకు రూ.2400, సాధారణ రకానికి రూ.2369 మద్దతు ధర కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రొండి రాజు, రంగు వెంకటేశ్‌‌‌‌‌‌‌‌, వకుళాభరణం శ్రీనివాస్, సోయినేని కరుణాకర్, తోట రాజు, రోమాల ప్రవీణ్​ పాల్గొన్నారు.

పంట మార్పిడిపై రైతులు దృష్టి పెట్టాలి

పెద్దపల్లి/సుల్తానాబాద్, వెలుగు: నిత్యం ఒకే పంట కాకుండా రైతులు పంటల మార్పిడిపై దృష్టి పెట్టాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో, ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలాల్లోని పలు గ్రామాల్లో  గురువారం కొనుగోలు సెంటర్లను ఆయన ప్రారంభించారు. రైతుల సంక్షేమాన్ని పట్టించుకోని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు వారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. 

కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వేణు, లైబ్రరీ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌‌‌‌‌‌‌‌ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్, డీఎంవో  శ్రీకాంత్, లీడర్లు మహేందర్, రాములు, అజయ్ గౌడ్, సరయ్య గౌడ్, గజనవేన సదయ్య , రైతులు పాల్గొన్నారు.

గన్నేరువరం, వెలుగు: రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మి  మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. గురువారం ఐకేపీ, ప్యాక్స్ ఆధ్వర్యంలో గన్నేరువరం మండల కేంద్రంతోపాటు  గుండ్లపల్లి, గునుకులకొండాపూర్, చీమలకుంటపల్లి, జంగపల్లి, హనుమజీపల్లి, గోపాల్పూర్, మాదాపూర్  గ్రామాలలో  ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో పులి కృష్ణ, మాతంగి అనిల్, శ్రీనాథ్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సునీల్, మల్లారెడ్డి, కోటి, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.