వేములవాడరూరల్, వెలుగు: పార్టీలకతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ రూరల్ మండలం పోచెట్టిపల్లి, అర్బన్ మండలం గుర్రంవానిపల్లె గ్రామాల్లో శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారులకు కొత్త బట్టలు పెట్టారు.
అనంతరం మాట్లాడుతూ ప్రతిఒక్కరికీ ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ ఇండ్లను మంజూరుచేస్తున్నట్లు చెప్పారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, వకుళాభరణం శ్రీనివాస్, కరుణాకర్, వెంకటేశ్, ప్రవీణ్, ఎల్లగౌడ్, రాజు పాల్గొన్నారు.
