తుంగతుర్తి, వెలుగు: వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. సోమవారం తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామంలో పల్లె దవాఖాన నూతన భవన ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు.
నాగారం మండల కేంద్రంలో నూతన గ్రామపంచాయతీని ప్రారంభించారు. డీఎంహెచ్‌వో వెంకటరమణ, ఎంపీడీవో శేషు కుమార్, అన్నారం గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు దొంగరి గోవర్ధన్, ప్రవీణ్ రెడ్డి , గుడిపాటి సైదులు, బింగి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
