జడ్చర్ల మున్సిపాలిటీకి రూ.4 కోట్లు కేటాయిస్తా :ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

జడ్చర్ల మున్సిపాలిటీకి రూ.4 కోట్లు కేటాయిస్తా :ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
  •     ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి 

జడ్చర్ల టౌన్, వెలుగు: జడ్చర్ల మున్సిపాలిటీకి రూ.4 కోట్ల ముడా నిధులు కేటాయించి, అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే అనిరుధ్​ రెడ్డి హామీ ఇచ్చారు. ఓపెన్ జిమ్ కు కూడా నిధులు మంజూరు చేస్తానని పేర్కొన్నారు. జడ్చర్ల పట్టణంలోని సీనియర్ సిటిజన్​భవన పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. 

బీఆర్ఎస్​హయాంలో మాజీ ఎమ్మెల్యే రూ.30 కోట్ల ముడా నిధులను మహబూబ్​నగర్ కు ఇచ్చారని ఆరోపించారు. మున్సిపల్ మాజీ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ కోనేటి పుష్పలత, కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.