
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో బుధవారం రాత్రి 11:30లకు తెలంగాణ విద్యార్థి ఫెడరేషన్ నేత సురేష్ యాదవ్ అనే విద్యార్థిపై చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ అనుచరులు దాడి చేశారు. సురేష్ యాదవ్ రాత్రి భోజనం చేసి రూమ్‌లో పడుకునే సమయంలో బాల్కసుమన్ అనుచరులు సుమారు 20 మంది మారణాయుధాలతో దాడిచేశారు. వారి నుంచి తప్పించుకున్న సురేష్ యాదవ్.. ఓయూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
‘నన్ను కొట్టడానికి 20 మంది రావడంతో నేను రూమ్ నుంచి బయటకు వచ్చి రీసెర్చ్ సెంటర్ వద్ద చెట్లల్లో దాక్కున్నాను. నేను విద్యార్ధి సమస్యలపై ప్రశ్నించినందుకే ఈ దాడి జరిగింది. మా బాల్కసుమన్ అన్ననే కాదు.. టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే నిన్నే కాదు ఎవరినైనా చంపుతాం అనుకుంటూ రూమ్‌లోకి బీర్ సీసాలు విసురుకుంటూ వెళ్లిపోయారు. వారంతా వెళ్లిపోయిన తర్వాత ఉస్మానియా క్యాంపస్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి వారిపై ఫిర్యాదు చేశాను. నాకు బాల్క సుమన్ నుంచి ప్రాణ హాని ఉంది. కావున తక్షణమే వారిని అరెస్టు చేసి నాకు న్యాయం చేయాలి’ అని సురేష్ యాదవ్ అన్నారు.
విద్యార్థి నేత సురేష్ యాదవ్‌పై జరిగిన దాడిని టీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ మాదిగ ఖండించారు. ‘రాష్ట్ర ప్రభుత్వం గత నెల రోజుల నుంచి అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాల మీద నాతో పాటు సురేష్ యాదవ్ అన్ని ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఇది జీర్ణించుకోలేని టీఆర్ఎస్ తొత్తులు కొందరు.. సురేష్ యాదవ్‌పై దాడి చేశారు. చెప్పుకోలేని చోట కొట్టారని సురేష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక రాబందుల రాజ్యంలో ఉన్నమా అని కృష్ణ మాదిగ ప్రశ్నించారు. తక్షణమే బాల్కసుమన్ అనుచరులను అరెస్టు చేయాలి అని ఆయన డిమాండు చేశారు.
For More News..