గద్వాల టౌన్, వెలుగు: చేనేత కార్మికులకు ప్రభుత్వ పరంగా చేయూతనిస్తామని ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం గద్వాల టౌన్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో గద్వాల, గట్టు చేనేత క్లస్టర్ పరిధిలోని 368 మంది కార్మికులకు చేనేత పరికరాలు అందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వీటిని పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు జంబు రామన్ గౌడ్, విజయ్ కుమార్, రాజశేఖర్, మురళి, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లిఫ్టింగ్ మెషీన్లను వినియోగించుకోండి
శాంతినగర్, వెలుగు: చేనేత లిఫ్టింగ్ మెషీన్లను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే విజయుడు సూచించారు. బుధవారం రాజోలి మండల కేంద్రంలో చేనేత కార్మికులకు మెషీన్లను పంపిణీ చేశారు. అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను
ఆదేశించారు.
