మిర్యాలగూడ, వెలుగు: ఫేక్ న్యూస్‌లతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఫైర్ అయ్యారు. తాను లంచం తీసుకున్నట్లు రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. రాజకీయ నేపథ్యం లేకుండానే ప్రజల ఆశీర్వాదంతో గెలిచానని, ప్రజా సమస్యల పరిష్కారానికే కృషి చేస్తున్నానన్నారు.
తన కుమారుడి రిసెప్షన్ ఖర్చుగా వినియోగించాల్సిన రూ.2 కోట్లను రైతుల కోసం అందించానని తెలిపారు. ఆ చెక్కును ఫేక్‌గా చూపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకులు వదిలేసిన అభివృద్ధి పనులను సరిచేయడానికి రెండేళ్లు పట్టిందన్నారు. ప్రస్తుతం రూ.400 కోట్లతో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రజల సామాజిక, ఆర్థిక జీవన ప్రమాణాల మెరుగుదలే అసలైన అభివృద్ధి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
