ఎమ్మెల్యే భాస్కర్ రావును వెంటనే బర్తరఫ్ చేయాలె : ప్రవీణ్ కుమార్

 ఎమ్మెల్యే భాస్కర్ రావును వెంటనే  బర్తరఫ్ చేయాలె : ప్రవీణ్ కుమార్

మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావును వెంటనే  భర్తరఫ్ చేయాలని  బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. కేసీఆర్ వేసే రోడ్లు ఆయన ఫాం హౌస్ నుంచి ఇచ్చే పైసలతో వేస్తున్నవి కావని అన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడే ఎమ్మెల్యేలను రాష్ట్రం నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ హయాంలో ధర్మపురి అభివృద్ధి అసాధ్యమని ప్రవీణ్ కుమార్ అన్నారు. నాలుగుసార్లు గెలిచిన కొప్పుల నియోజకవర్గంలో ఒక్కరికీ డబుల్ బెడ్రూం కూడా ఇవ్వలేదని విమర్శించారు. సంక్షేమ శాఖ మంత్రి పేదల సంక్షేమాన్నిగాలికొదిలేశారని మండిపడ్డారు. రాష్ట్ర వనరులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారన్న ఆయన... ఇసుక దందాలో రోజుకు కోటి రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపించారు. 

జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన బోగ శ్రావణికి ప్రవీణ్ కుమార్ సంఘీభావం తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ ఆధిపత్యం, అవమానం భరించలేకనే శ్రావణి రాజీనామా చేసిందని అన్నారు. బహుజనులు ఆత్మగౌరవంతో బతకాలంటే బీఎస్పీ చేరాలని కోరారు.