ఖానాపూర్, వెలుగు: ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆదివారం ఖానాపూర్ పట్టణంలోని 5వ వార్డులో మార్నింగ్ వాక్ చేశారు. ‘పొద్దు పొడుపు..బొజ్జన్న అడుగు’ కార్యక్రమంలో భాగంగా 5వ వార్డు పరిధిలోని టవర్స్ కాలనీ, ఇంద్రనగర్, కరీం కాలనీలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఖానాపూర్ మున్సిపల్ అభివృద్ధికి ఇటీవలే ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.
ఆయా కాలనీల్లో ఉన్న సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజురా సత్యం, ఆత్మ చైర్మన్ తోట సత్యం, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నిమ్మల రమేశ్, మాజీ కౌన్సిలర్లు పరిమి సురేశ్, కిశోర్ నాయక్, శంకర్, నాయకులు ఖాజా, షౌకత్ పాషా, చరణ్ తదితరులున్నారు.
సార్గమ్మ విగ్రహ ప్రతిష్టాపన
ఖానాపూర్ లోని శ్రీరాంనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సార్గమ్మ విగ్రహావిష్కరణ ఆదివారం వీడీసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు.
