
ఖానాపూర్, వెలుగు: గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. ఖానాపూర్ మండలం బాదనకుర్తిలో ఆదివారం ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ చేపట్టి ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైనా ఇందిరమ్మ ఇండ్లు రానివా రికి మంజూరు చేయిస్తానని భరోసా ఇచ్చారు. గ్రామంలో మురికి కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణాన్ని త్వరలో చేపడుతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని స్థానిక నాయకులకు సూచించారు. ఏమైనా సమస్యలుటే ప్రజలు నేరుగా తనకు ఫోన్ చేసి చెప్పాలన్నారు.
స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండండి
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఖానాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖానాపూర్, పెంబి మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా పదవులు వస్తాయని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేస్తున్న వ్యతిరేక ప్రచారాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
అనంతరం మొహరం పండుగను పురస్కరించుకొని మండలంలోని సింగపూర్ గ్రామంలో పీరీల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్దుల్ మాజిద్, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు దయానంద్, నిమ్మల రమేశ్, మున్సిపల్ మాజీ చైర్మన్ చిన్నం సత్యం, నాయకులు గుడాల రాజన్న, షబ్బీర్ పాషా, సత్యం, నర్సయ్య, సలీం, జహీర్ తదితరులు పాల్గొన్నారు.