సదాశివపేటలో ఉచిత వైద్య సేవలు అభినందనీయం : ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ 

సదాశివపేటలో ఉచిత వైద్య సేవలు అభినందనీయం : ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ 

సదాశివపేట, వెలుగు: ప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సదాశివపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్ర మోడల్ స్కూల్ లో ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులతో కలసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. సదాశివపేట పట్టణ ప్రజలు ఉచిత మెగా హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అనంతరం పట్టణంలో కొత్తగా నిర్మించిన ఆధ్యా హాస్పిటల్ ను నిర్వాహకులతో కలసి ప్రారంభించారు. కార్యక్రమంలో శివరాజ్ పాటిల్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గోపాల్, విద్యాసాగర్ రెడ్డి, చింత సాయినాథ్, మల్లన్న, డాక్టర్​కిషోర్, ఇంద్రమోహన్ గౌడ్, మైనార్టీ నాయకులు అక్బర్, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.