
- గిరిజన రిజర్వేషన్లు కేంద్రం దమ్ముంటే ఆపి చూడాలి
- ఎమ్మెల్యే దానం నాగేందర్
హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ పాలన బ్రిటీష్ వారి పరిపాలనలా ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను బూచిలా చూపిస్తూ.. బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్రానికి దమ్ముంటే గిరిజన రిజర్వేషన్లు ఆపి చూడాలని మా సీఎం సవాల్ విసిరారని దానం నాగేందర్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ విమోచన దినోత్సవం పేరుతో కార్యక్రమాలు చేసిందని.. ఇతర రాష్ట్రాల నుండి నాయకులను తెచ్చిందన్నారు. అమిత్ షా ను ఒక బూచిల చూపిస్తూ బీజేపీ ఇలాంటి రాజకీయాలు చేస్తోంది.. ఇది సహించారని నేరం అన్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే కు అసలు తెలంగాణ గురించి ఏం తెలుసు అని ప్రశ్నించారు. మేము అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పరు అని దానం నాగేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.