రూ.80 లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

రూ.80 లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

సత్తుపల్లి, వెలుగు : సత్తుపల్లి పట్టణంలో రూ.80 లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మంగళవారం శంకుస్థాపన చేశారు. రూ.50 లక్షలతో స్థానిక జవహర్ నగర్ లోని ఈద్గా ప్రహరీ  నిర్మాణం, ఎన్టీ ఆర్ నగర్ లోని మసీద్ లో రూ. 5 లక్షలతో షెడ్ నిర్మాణానికి, రూ. 25 లక్షలతో బైపాస్ రోడ్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఇందిరమ్మ ఇండ్లలో గృహప్రవేశాలు చేసిన వారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం, డిప్యూటి సీఎం రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి సహకారంతో నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. 

పనితీరు, సర్వే ఆధారంగానే టికెట్లు

కల్లూరు : ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించే వ్యక్తులకు, నిష్పక్షపాతంగా నిర్వహించే సర్వే నివేదికల ఆధారంగానే మున్సిపాలిటీ ఎన్నికల టికెట్లు కేటాయిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి స్పష్టం చేశారు.

మంగళవారం రాత్రి స్థానిక ఏఎంసీ కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్​ నేత మట్టా దయానంద్​తో కలిసి మాట్లాడారు.  పార్టీ అభ్యర్థులను ప్రకటించే వరకు వార్డుల్లో ప్రచారాలు చేయవద్దని, టికెట్ ఎవరికి వచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేసి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.