అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే విఫలం : ముషీరాబాద్ కార్పొరేటర్

అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే విఫలం : ముషీరాబాద్  కార్పొరేటర్

ముషీరాబాద్, వెలుగు: ముషీరాబాద్​ డివిజన్​ను స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని స్థానిక కార్పొరేటర్​ సుప్రియా గౌడ్ ఆరోపించారు. జనాలకు ఇచ్చిన హామీ మేరకు తాము అధికారుల చుట్టూ తిరుగుతూ ఒక్కొక్క పనిని శాంక్షన్ చేయిస్తున్నామని పేర్కొన్న ఆమె.. కానీ ఎమ్మెల్యే వీటిని తన ఖాతాలో వేసుకోవడం దారుణమన్నారు. సుప్రియ తన ఆఫీసులో  బుధవారం మీడియాతో మాట్లాడారు. కమలా నెహ్రూనగర్ కాలనీ, పఠాన్ బస్తీలో నెలకొన్న సమస్యలపై అధికారుల వద్దకు వెళ్లి ఎస్టిమేషన్ చేయించి డ్రైనేజీ లేన్లను తాను శాంక్షన్ చేయించానని తెలిపారు. 

కానీ ఎమ్మెల్యే ముఠా గోపాల్ స్థానిక కార్పొరేటర్ అయిన తనకు కనీస సమాచారం ఇవ్వకుండా ఈ పనులకు శంకుస్థాపన చేయడం సరికాదన్నారు. ఆయనే ఈ పనులను తానే శాంక్షన్ చేయించినట్టు ఎమ్మెల్యే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచార హక్కు చట్టంతో ఎమ్మెల్యే చేపట్టిన అభివృద్ధి పనుల సమాచారాన్ని తెప్పించుకొని జనాలకు వివరిస్తామన్నారు.