ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే గడ్డం వినోద్

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం :  ఎమ్మెల్యే గడ్డం వినోద్
  •     ఎమ్మెల్యే గడ్డం వినోద్

బెల్లంపల్లి, వెలుగు: ప్రజల సంక్షేమం కోసమే కాంగ్రెస్​ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే గడ్డం వినోద్​ అన్నారు. మున్సిపల్​ఎన్నికలను పురస్కరించుకుని సోమవారం బెల్లంపల్లి క్యాంపు కార్యాలయంలో  ఏర్పాటు చేసిన కాంగ్రెస్​పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని 34 వార్డుల్లో కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయన్నారు. 

మహిళలు, రైతులు, యువతకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తోందన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనతోపాటు పట్టణంలో రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సమస్య పరిష్కారం, విద్యా,-వైద్య రంగాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పి.రఘునాథ్​రెడ్డి, మున్సిపల్​మాజీ చైర్మన్​ఎం.సూరిబాబు, పట్టణ​ అధ్యక్షుడు ఎం.మల్లయ్య, టీపీసీసీ ప్రచార కార్యదర్శి నాతరి స్వామి, పలువురు నాయకులు పాల్గొన్నారు.