ఎల్లారంలో సన్నబియ్యం లబ్ధిదారులతో భోజనం : ఎమ్మెల్యే గడ్డం వినోద్

ఎల్లారంలో సన్నబియ్యం లబ్ధిదారులతో భోజనం : ఎమ్మెల్యే గడ్డం వినోద్

బెల్లంపల్లి రూరల్, వెలుగు: ప్రజలకు లబ్ధిచేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీతో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ​అన్నారు. మంగళవారం కన్నెపల్లి మండలంలోని ఎల్లారంలో సన్నబియ్యం లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు. అంతకుముందు సుర్జాపూర్​లో బీటీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం జన్కాపూర్​లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఎల్లారం గ్రామానికి వేసిన బీటీ రోడ్డును ప్రారంభించారు.

 కన్నెపల్లి, భీమిని మండలాల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో బెల్లంప్లలి మార్కెట్​కమిటీ మాజీ వైస్ చైర్మన్​ నర్సింగరావు, భీమిని, కన్నెపల్లి మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, రామాంజనేయులు, మాజీ జడ్పీటీసీ అల్లి మోహన్​, నాయకులు జలపతి, రోహిత్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.  

కాంగ్రెస్​లో చేరిన మాజీ జడ్పీటీసీ

కన్నెపల్లి మండల మాజీ జడ్పీటీసీ కౌటారపు సత్యనారాయణ మంగళవారం కాంగ్రెస్​లో చేరారు. ఆయనకు ఎమ్మెల్యే వినోద్ పార్టీ కండువా కప్పి ఆహ్వనించారు. కాంగ్రెస్​ పార్టీ ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితుడినై పార్టీలో చేరుతున్నట్లు సత్యనారాయణ చెప్పారు.