బెల్లంపల్లి అభివృద్ధికి ప్రాధాన్యం : ఎమ్మెల్యే గడ్డం వినోద్

బెల్లంపల్లి అభివృద్ధికి ప్రాధాన్యం :  ఎమ్మెల్యే గడ్డం వినోద్
  •     ఎమ్మెల్యే గడ్డం వినోద్

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో డీఎంఫ్​టీ, యూఐడీఎఫ్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. సంవత్సరాల తరబడి పట్టణాభివృద్ధి వెనుకబడిందని, ప్రస్తుతం అన్ని మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయించామన్నారు. 

రోడ్లు, మురుగు కాలువల నిర్మాణంతో పట్టణ రూపురేఖలు మారుతాయన్నారు. పట్టణ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య, మున్సిపల్  మాజీ చైర్మన్ సూరిబాబు, నాయకులు శంకర్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.