బీఆర్ఎస్ విష ప్రచారాన్ని తిప్పి కొట్టాలి : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

బీఆర్ఎస్ విష ప్రచారాన్ని తిప్పి కొట్టాలి :  ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
శాయంపేట, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్​ చేస్తున్న విష ప్రచారాన్ని కాంగ్రెస్​ కార్యకర్తలు తిప్పి కొట్టాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. శాయంపేట రైతు వేదికలో శనివారం లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్​ చెక్కులు పంపిణీ చేశారు. బీఆర్ఎస్​ అభివృద్ధి పేరిట ప్రజాధనాన్ని దోచుకొని, రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తోందన్నారు.
 
రైతులకు, మహిళలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, పరకాల మార్కెట్ కమిటీ వైస్​ చైర్మన్​ బుజ్జన్న, అధికార ప్రతినిధి చిందం రవి, బాసాని మార్కండేయ, రాజు పాల్గొన్నారు.