బాబు ఏజెంట్ రేవంత్..దమ్ముంటే నాపై పోటీ చెయ్: గండ్ర

బాబు ఏజెంట్ రేవంత్..దమ్ముంటే నాపై పోటీ చెయ్: గండ్ర

టీడీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సవాల్ విసిరారు. తాను అక్రమంగా సంపాదించినట్లు రేవంత్ నిరుపిస్తావా అని ప్రశ్నించారు. ప్రజా జీవితంలో ఆస్తులు అమ్ముకున్నానని చెప్పారు. తాను అక్రమంగా ఆస్తులు సంపాదించినట్లు రేవంత్ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని గండ్ర తెలిపారు. తనపై పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయోద్దన్నారు. అవినీతి పరులకు దేశ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. చంద్రబాబు ఏజెంట్ గా తెలంగాణలో చెలామణి అవుతున్నాడని విమర్శించారు. రేవంత్ తో తిరిగేవాళ్లంతా చంద్రబాబు బీ టీమేనని గండ్ర పేర్కొన్నారు. దమ్ముంటే భూపాలపల్లిలో పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. నిన్ను చిత్తుగా ఓడిస్తా సవాల్ కు సిద్ధమా అని గండ్ర వెంకటరమణారెడ్డి రేవంత్ ను ప్రశ్నించారు.