పొన్నం పలుకుబడి గుండుసున్నా: గంగుల

పొన్నం పలుకుబడి గుండుసున్నా: గంగుల

కరీంనగర్‌ : కాంగ్రెస్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు కరీంనగర్‌ TRS ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌. TRS పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ను, తనను పొన్నం ప్రభాకర్‌ వ్యక్తిగతంగా దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.  “పొన్నం ప్రభాకర్‌.. మరో కేఏ పాల్‌. ఆయన ఓ రాజకీయ వ్యభిచారి. పొన్నం ఐదుసార్లు పోటీ చేస్తే ఒక్కసారి గెలిచిండు. నేను ఐదుసార్లు పోటీ చేస్తే ఐదుసార్లు గెలిచాను. పొన్నం ప్రభాకర్‌ కుటుంబమంతా ఓటమి చరిత్రే. తెలంగాణ ఉద్యమంలో డ్రామా ఆర్టిస్ట్‌ పొన్నం ప్రభాకర్‌. నేను కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ప్రయత్నించానని పొన్నం ప్రభాకర్‌ దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం నిరూపించకపోతే పొన్నం ప్రభాకర్‌ ముక్కు నేలకు రాయాలి. కేటీఆర్‌ ను విమర్శించే అర్హత పొన్నం ప్రభాకర్‌కు ఉందా? సంస్కారం లేకుండా పొన్నం మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కరీంనగర్‌ లో పొన్నం పలుకుబడి గుండుసున్నా అన్నారు గంగుల కమలాకర్‌.