నిరుపేదల సంక్షేమమే బీఆర్‌‌ఎస్​ లక్ష్యం : గూడెం మహిపాల్ రెడ్డి

 నిరుపేదల సంక్షేమమే బీఆర్‌‌ఎస్​ లక్ష్యం : గూడెం మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం, వెలుగు : నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం అమీన్​పూర్​ మండల పరిధిలోని కిష్టారెడ్డిపేట, జానకంపేట గ్రామాలకు చెందిన అసంఘటితరంగ కార్మికులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌‌ఎస్​లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమమే  లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. అసంఘటితరంగ కార్మికులకు అండాగా ఉంటామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, సర్పంచులు కృష్ణ, పాండు, మాజీ ఎంపీపీ యాదగిరి, వెంకటేశ్​ గౌడ్  పాల్గొన్నారు. 

పటాన్​చెరు: రాష్ట్రంలో కొనసాగుతోన్న అభివృద్ధి, సంక్షేమం మరింత ముందుకు వెళ్లాలంటే బీఆర్ఎస్​ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని లారీ, ఆటో డ్రైవర్లకు, ఫొటోగ్రాఫర్లకు రూ.15 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తామన్నారు. శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ లు మాట్లాడుతూ..  ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అద్భుతమైన మేనిఫెస్టోను రూపొందించారన్నారు.