- ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
అమీన్పూర్(పటాన్చెరు), వెలుగు: యాంత్రీకరణతో సాగులో అధిక దిగుబడులు సాధించవచ్చని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. శనివారం పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని రైతులకు సబ్సిడీపై మంజూరైన పరికరాలను రైతులకు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. సంప్రదాయ పద్ధతులతో ఖర్చులు పెరిగి దిగుబడి మాత్రం తక్కువగా వస్తున్నదన్నారు. యంత్రాలు వాడకం వల్ల వ్యయం తగ్గడమే కాకుండా దిగుబడి పెరుగుతుందన్నారు.
యంత్ర పరికరాలపై ప్రభుత్వం 40 శాతం సబ్సిడీ అందిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా 64 మంది రైతులకు రూ.27 లక్షల విలువైన పరికరాలను అందజేశారు. కార్యక్రమంలో వెలిమల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ బుచ్చిరెడ్డి, వ్యవసాయ శాఖ ఏడీ మనోహర, అధికారులు రవీంద్రనాథ్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
క్రిస్టియన్ల సంక్షేమానికి కృషి
పటాన్చెరు నియోజకవర్గంలోని క్రిస్టియన్ల సంక్షేమానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలోని చర్చిల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10.80లక్షల విలువైన చెక్కులను శనివారం సాయంత్రం ఆయా పాస్టర్లకు అందజేశారు. రెండు విడతల్లో 70 చర్చిలకు రూ.21లక్షలు అందజేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ జ్యోతిరెడ్డి, మెప్మా డీపీవో స్వాతి, సీవోలు రేఖా, జ్యోతి, పాస్టర్లు పాల్గొన్నారు.
