జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడలకు వేదికగా పటాన్చెరు : ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి

 జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడలకు వేదికగా పటాన్చెరు : ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
  • ముగిసిన ఖోఖో క్రీడలు 

అమీన్​పూర్, పటాన్​చెరు, వెలుగు: జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడలకు వేదికగా పటాన్​చెరు పట్టణాన్ని తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్​రెడ్డి చెప్పారు. పటాన్​చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో మూడు రోజులుగా జరుగుతున్న ఖోఖో క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి.  ముగింపు వేడుకలకు ఎమ్మెల్యే హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. బాలుర విభాగంలో ఆదిలాబాద్​ జిల్లా జట్టు ప్రథమ, రంగారెడ్డి జిల్లా జట్టు ద్వితీయ , హైదరాబాద్​ జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. బాలికల విభాగంలో ఆదిలాబాద్​ ప్రథమ, మహబూబ్​నగర్​ ద్వితీయ, నల్లగొండ తృతీయ స్థానంలో నిలిచాయి. 

ఎమ్మెల్యే మాట్లాడుతూ..రూ.7కోట్లతో మైత్రి మైదానాన్ని ఆధునీకరించామని చెప్పారు. ఏడాది పొడవునా క్రీడలు నిర్వహించేలా  ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఖోఖో అసోసియేషన్​ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి, సీఐ వినాయక్​​రెడ్డి, జిల్లా అధ్యక్షుడు హరికిషన్​, ప్రధానకార్యదర్శి శ్రీకాంత్​గౌడ్​, మార్కెట్​ కమిటీ మాజీ చైర్మన్​ విజయ్​కుమార్, మైత్రి క్రికెట్​ క్లబ్​ అధ్యక్షుడు హనుమంత్​ రెడ్డి, ఎస్​జీఎఫ్​ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్​, పీడీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.  

నూతన కాలనీలకు స్వచ్ఛ జలాలు 

పటాన్​చెరు నియోజకవర్గంలోని నూతన కాలనీలకు మిషన్​ భగీరథ, జలమండలి ద్వారా స్వచ్ఛ జలాలను అందించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి తెలిపారు. పటాన్​చెరు పరిధిలోని కృషి డిఫెన్స్​ కాలనీలోని అపార్ట్​మెంట్​ వాసులకు జలమండలి ద్వారా తాగునీటి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నూతన రిజర్వాయర్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. 

గుమ్మడిదల మున్సిపల్​ కేంద్రంలోని రామాలయం జీర్ణోధారణ పనులకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. హానర్​ ల్యాబ్​ పరిశ్రమ సహకారంతో రూ.1.10 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఆలయ ప్రాకారం పనులకు శంకుస్థాపన చేశారు. శతాబ్ధాల చరిత్ర కలిగిన ఆలయాన్ని దైవత్యం ఉట్టిపడేలా పునర్నిర్మిస్తున్నామని తెలిపారు. ఆలయ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్​ కమిషనర్​ దశరథ్​, మాజీ జడ్పీటీసీ కుమార్​గౌడ్​, నాయకులు విజయభాస్కర్​రెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు బాల్​రెడ్డి, పరిశ్రమ ప్రతినిధి రవీందర్​రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.