అమీన్పూర్, వెలుగు: సమాజ సేవలో కుల సంఘాల పాత్ర మరింత బలపడాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ గుట్టపై వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్తీక మాసం వనభోజనాల కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో వీరశైవుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రూ.30లక్షల సొంత నిధులతో బీరంగూడ కమాన్ వద్ద మహాత్మ బసవేశ్వరుడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలలోనే వీరశైవులకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం చిన్నారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, మున్సిపల్మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నర్సింహాగౌడ్, మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ విజయ్‌కుమార్, వీరశైవ లింగాయత్ జిల్లా అధ్యక్షుడు నర్సింలు, నియోజకవర్గ అధ్యక్షుడు జగదీశ్, నాయకులు రుశ్వంత్రెడ్డి, రామచంద్రారెడ్డి, లింగాయత్ సమాజం ప్రతినిధులు పాల్గొన్నారు.
