బయట లీడర్లకు స్థానిక సమస్యలు ఏం తెలుస్తయ్​ : హన్మంత్​ షిండే

బయట లీడర్లకు స్థానిక సమస్యలు ఏం తెలుస్తయ్​ : హన్మంత్​ షిండే

పిట్లం, వెలుగు: ఎన్నికలప్పుడు బయట నుంచి లీడర్లు వచ్చిపోతుంటారని, తాను మాత్రం పక్కా లోకల్​ అని బీఆర్ఎస్ ​జుక్కల్​అభ్యర్థి, ఎమ్మెల్యే హన్మంత్​షిండే పేర్కొన్నారు. ఆదివారం ఆయన పిట్లం మండలంలోని తిమ్మానగర్, మార్దండ, కంభాపూర్, గోద్మేగామ్, కారేగామ్, చిన్నకొడప్​గల్, ధర్మారం, బుర్నాపూర్, అల్లాపూర్, పారడ్​పల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా హన్మంత్​ షిండే మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాకు చెందిన లక్ష్మీకాంత్​రావుకు కాంగ్రెస్​టికెట్​ఇవ్వాలని చూస్తుండగా, నిజామాబాద్​కు చెందిన అరుణతారకు బీజేపీ టికెట్ ఇచ్చిందన్నారు. వీరిద్దరికీ స్థానిక సమస్యలపై అవగాహన లేదని, అలాంటప్పుడు ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తారన్నారు. గత తొమ్మిదేండ్లుగా పేదల సంక్షేమమే పరమావధిగా పని చేశానన్నారు. 

మెనిఫెస్టోలో లోని అనేక పథకాలను బీఆర్ఎస్​ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ఈ సందర్భంగా తిమ్మానగర్ గ్రామానికి చెందిన పలువురు పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ కవిత, జడ్పీటీసీ అరికెల శ్రీనివాస్​రెడ్డి, మాజీ ఎంపీపీ రజనీకాంత్​రెడ్డి, లీడర్లు అన్నారం వెంకట్రామ్​రెడ్డి, వాసరి రమేశ్, సాయిరెడ్డి, ప్రతాప్​రెడ్డి, దేవేందర్​రెడ్డి, నర్సాగౌడ్, జగదీశ్ ​పాల్గొన్నారు.