మెదక్ను జిల్లాగా చేసిందే కేసీఆర్: హరీష్రావు

మెదక్ను జిల్లాగా చేసిందే కేసీఆర్: హరీష్రావు

మెదక్‌ను జిల్లా చేస్తామని చెప్పి ఇందిరాగాంధీ మోసం చేస్తే.. ఆ కలను నెరవేర్చింది కేసీఆర్ అని అన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలే.. మెదక్ రాందాస్ చౌరస్తా మీదుగా నామేనేషన్ వేసేందుకు వెళ్లావు.. నీకు మెందక్ అభివృద్ధి కనిపించ లేదా అని ప్రశ్నించారు. 

మెదక్ కు రైలు తెచ్చింది కేసీఆర్, వందకోట్లు ఖర్చు రైల్వేలైన్ తెచ్చింది కేసీఆర్ అన్నారు హరీష్ రావు.మెదక్ ను మూడు జిల్లాలుగా చేసి , మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ ది అన్నారు. చిట్టచివరి ఆయకట్టుకు కూడా కేసీఆర్ నీళ్చిచ్చారు. ఇంత చేసినా కేసీఆర్ ఏమీ చేయలేదని అంటున్నాడు.. అబద్దాలు చెప్పడంలో రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చన్నారు హరీష్ రావు.

సీఎం హోదాలో ఉండి రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉరికిచ్చి కొడ్తా, పేగులు మెడలేసుకుంటా.. బొంద పెడ్తా, మానవ బాంబునవుతానని అనడం సరికాదన్నారు. ఇవి సీఎం మాట్లాడాల్సిన మాటలేనా అని ప్రశ్నించారు. హామీల గురించి అడిగితే కేసులు పెడుతున్నారు.. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని చెప్పి వందరోజులు దాటిన చేయనందుకు రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు హరీష్ రావు. రైతులు సమస్యల గురించి సీఎం రేవంత్ రెడ్డి ఆలోచించడం లేదని విమర్శించారు. కేసీఆర్ ను తిడుతూ కాలయాపనం చేయడం కాదు.. హామీలను నెరవేర్చాలని అన్నారు. 

మెదక్ లో గెలిచేది బీఆర్ ఎస్సీ, జిల్లా ఇచ్చింది మేం.. గోదావరి నీళ్లు తెచ్చింది మేం.. లక్షల ఉద్యోగాలిచ్చింది మేం..విజ్ణులైన మెదక్ ఓటర్లు బీఆర్ ఎస్ పార్టీని ఆదరిస్తారని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.