అక్రమ కట్టడాల కూల్చివేతలో పక్షపాతమెందుకు : ఎమ్మెల్యే కాటిపల్లి

 అక్రమ కట్టడాల కూల్చివేతలో పక్షపాతమెందుకు : ఎమ్మెల్యే కాటిపల్లి

కామారెడ్డి : రాజకీయ నాయకులకు చెందిన అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోకుండా సామాన్యుల ఇండ్లను ఎలా కూలుస్తారని మున్సిపల్​సిబ్బందిని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రశ్నించారు. పట్టణంలో పేదల ఇండ్లను కూల్చివేయడాన్ని నిరసిస్తూ మున్సిపల్ ఆఫీస్ వద్ద ఎమ్మెల్యే ఆందోళన చేశారు. టౌన్ లో   నాయకుల అక్రమ కట్టడాలను ఎందుకు తొలగించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ప్రజలతో మాట్లాడి కూల్చివేతలు చేపట్టాలని సూచించారు. కొందరు ప్రజాప్రతినిధులు చెప్పగానే ఎలా కూల్చివేశారని ప్రశ్నించారు. టౌన్ లో ఉన్న అన్ని అక్రమ కట్టడాలు కూల్చివేయాలని డిమాండ్ చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎవరు చెబితే కూల్చివేశారో చెప్పాలని కమిషనర్, అధికారులను ఎమ్మెల్యే నిలదీశారు. 

ఈ క్రమంలోనే మున్సిపల్​చైర్మెన్ హిమబిందు అక్కడకు వచ్చారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో  కాంగ్రెస్ కౌన్సిలర్లు వాగ్వివాదానికి దిగారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో  ఫోన్ లో మాట్లాడారు. ఆ తర్వాత  కౌన్సిలర్లు, బీజేపీ లీడర్స్ మధ్య వాగ్వాదం జరిగింది.  దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.