సమైక్య పాలనలో నా ఫోన్ ట్యాప్ చేశారు: ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

సమైక్య పాలనలో నా ఫోన్ ట్యాప్ చేశారు: ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

నల్లగొండ జిల్లా : రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోదని మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. మిర్యాలగూడలో కార్యకర్తల సన్నాహక సమావేశానికి ఆయన హాజరైయారు. పొలాలు ఎండిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. తప్పుటి కేసులు పెట్టి బీఆర్ఎస్ నాయకులను ఇబ్బందులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాదని విమర్శించారు. సమైక పాలన టైంలో ఉద్యమ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారని, లగడపాటి రాజగోపాల్ తన ఫోన్ ట్యాప్ చేశారని ఎమ్మెల్యే అన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


బీఆర్ఎస్ పార్టీ పదేళ్లు అధికారంలో ఉన్నాం.. పోలీసులను ఏనాడు వాడుకోలేదన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే అక్రమ కేసులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎండిన పంటలకు నీళ్లు ఇవ్వమంటే చేతకాని దద్దమ్మలు కాంగ్రెస్ పార్టీ నాయకులని విరుచుకు పడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సాగర్ లో డెడ్ స్టోరేజ్ లో నీళ్లు ఉన్నా సాగునీరు ఇచ్చామని ఆయన అన్నారు. ఆత్మహత్య చేసుకున్న అన్నదాతలు పేర్లు ప్రభుత్వానికి ఇస్తే పట్టించుకోలేదన్నారు. జిల్లా పిచ్చి మంత్రి ఎగిరెగిరి పడుతున్నాడని ఎద్దేవా చేశారు. రాజగోపాల్ రెడ్డికి ఎక్కడ పదవి వస్తుందో.. నా మంత్రి పదవి  ఏడా పోతుందో అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బెంగ పెట్టుకున్నాడని జగదీశ్ రెడ్డి కౌంటర్ విసిరాడు.