డెంగ్యూ ప్రబలుతున్నా ప్రభుత్వం పట్టించుకుంటలేదు: జగ్గారెడ్డి

డెంగ్యూ ప్రబలుతున్నా ప్రభుత్వం పట్టించుకుంటలేదు: జగ్గారెడ్డి

రాష్ట్రంలో డెంగ్యూ, క్యాన్సర్ వల్ల ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారని సీఎం కేసీఆర్ తక్షణమే తగు చర్యలు తీసుకోవాలన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి. డెంగ్యూ పేషెంట్స్ తో సంగారెడ్డి హాస్పిటల్స్ నిండిపోతున్నాయని అన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అయితే బెడ్ లు సరిపోవడంలేదన్నారు. ముఖ్యంగా స్లమ్స్ లో నివసిస్తున్న ప్రజలు డెంగ్యూతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో అసలు వైద్య మంత్రిత్వ శాఖ ఉందా అని అనుమానం వస్తుందని ఆయన చెప్పారు. డెంగ్యూను తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరారు జగ్గారెడ్డి. ఇందుకు కేసీఆర్ కు లేఖరాస్తానని అన్నారు. డెంగ్యూ పై ప్రభుత్వం స్పందించకపోతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి ఉద్యమం చేపట్టేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.

క్యాన్సర్ పేషెంట్స్ కోసం చిన్నజీయర్ స్వామి ట్రస్ట్ ఏర్పాటు చేయాలి: జగ్గారెడ్డి

క్యాన్సర్ బాధితులకోసం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి ట్రస్ట్ పెట్టాలని కోరారు జగ్గారెడ్డి. వారి వద్ద ఉన్న ధనిక భక్తుల ద్వారా ట్రస్ట్ పెంటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు చినజీయర్ స్వామికి కూడా లేఖ రాస్తానని చెప్పారు.