
మంత్రి జగదీశ్‌రెడ్డిపై జగ్గారెడ్డి ఫైర్
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్‌కు విస్కీలో సోడా కలిపి మంత్రివయ్యావని మినిస్టర్జగదీశ్రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. కెప్టెన్‌గా పనిచేసిన ఉత్తమ్‌పై సాదాసీదా అడ్వొకేట్ అయిన జగదీశా మాట్లాడేదంటూ ధ్వజమెత్తారు. క్యారెక్టర్ లేని మంత్రి.. మాజీ ప్రధాని నెహ్రూపై కామెంట్స్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. జగదీశ్ కరెంట్ మినిస్టరే కానీ ఆయన దగ్గర పవర్ లేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం అక్రమాలపై విచారణ కోరితే తప్పేంటన్నారు. తనపై ఉన్న పాస్పోర్ట్కేసుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌లే గురువులన్నారు. రూ.5 వేల కోట్లు పోగేసి టీఆర్ఎస్సర్కారును పడగొట్టడానికి హరీశ్ ప్రయత్నించలేదా అని ప్రశ్నించారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి డబ్బులు సంపాదించి కేసీఆర్ భజన మండలిలో చేరాడన్నారు. సబితా ఇంద్రారెడ్డిపై సీబీఐ కేసు ఉంది కాబట్టే కేబినెట్‌లోకి తీసుకున్నారా అని ప్రశ్నించారు.