మీకు తెలుసా : పాప్ కార్న్ ఎప్పుడు.. ఎక్కడ పుట్టింది.. పాప్ కార్న్ ఆరోగ్యమా కాదా..?

మీకు తెలుసా : పాప్ కార్న్ ఎప్పుడు.. ఎక్కడ పుట్టింది.. పాప్ కార్న్ ఆరోగ్యమా కాదా..?

ప్రయాణాల్లో.. సినిమాలకు .. పార్క్​ లకు .. క్రికెట్​ మ్యాచ్​ చూసేటప్పుడు.. పాప్​ కార్న్​ తింటూ.. టైమ్​ పాస్​ చేస్తాం..ఇది చాలామందికి ఫేవరెట్​ పుడ్​.. మొక్కజొన్నతో  తయారు చేసిన పాప్​  కార్న్​ ఎప్పుడు.. ఎక్కడ పుట్టింది.. ఇది కేవలం టైం పాస్​ కోసమేనా.. దీనివలన ఆరోగ్య పరంగా ఎలాంటి ఉపయోగాలున్నాయి... పాప్​ కార్న్​ గురించి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. .  .! 

మన చేతికి దొరికే ఏకైక టైమ్ పాస్ 'పాప్ కార్న్'. ప్రయాణాల్లో కూడా చాలా మందికి ఇది ఫేవరెట్ స్నాక్ ఐటం. మొక్కజొన్న కెర్నల్ (గుజ్జు) ను వేడి చేసినప్పుడు, పాప్ కార్న్ గా మారుతుంది. అధిక ఫైబర్ కలిగిన పాప్ కార్న్ ఆరోగ్యానికి చాలా మంచిది.

పాప్​ కార్న్​ కు  వేల ఏండ్ల చరిత్ర..

పాప్ కార్న్ కి  2 వేల సంవత్సరాలకు పైగా  చరిత్ర ఉందనేది ఓ అభిప్రాయం. అయితే క్రీస్తు పూర్వం 5 వేల సంవత్సరంలో మెక్సికో, పెరూ దేశ ప్రజలు కంకులను పండించేవాళ్లని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ సమయంలోనే వాళ్లు పాప్ కార్న్ తినేటోళ్లని ఆధారాలు కూడా దొరికాయట. అక్కడి నుంచి మిగతా దేశాలకు పాప్ కార్న్ ఫుడ్ కల్చర్ విస్తరించిందని వారంటున్నారు.

ఇవాళ ఏం చేస్తరు?

'ఒక గిన్నెడు తాజా పాప్ కార్న్ మీ రోజును సంతోషంగా ఉంచుతుంది'.. ఇది పాప్ కార్న్  థీమ్. రెగ్యులర్ ఫుడ్​ తో పాటు  పాప్ కార్న్​ ను మెనులో చేర్చాలి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రజలు  పాప్ కార్న్ ఇష్టంగా తింటారు.  అమెరికాలోని ఇలినాయిస్ రాష్ట్రం పాప్ కార్న్ కు  అధికారిక స్నాక్ గుర్తింపు ఇచ్చింది.

పాప్ కార్న్ ప్రయోజనాలు

  • పాప్ కార్న్ లోఫైబర్, యాంటీఆక్సిడెంట్,విటమిన్-బి కాంప్లెక్స్, మాంగనీస్, మెగ్నీషియం , ఐరన్ ఉంటాయి.
  •  కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.
  • జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
  • డయాబెటిక్ ఫ్రెండ్లీ స్నాక్.. రక్తంలో షుగర్ లెవల్​ ని నియంత్రిస్తుంది.
  • వృద్ధాప్య ఛాయల్ని దరిచేరనీయదు.
  • బరువు తగ్గడంలో, ఎముకలు పటిష్టపర్చడంలో తోడ్పడుతుంది.

బయట దొరికే పాప్ కార్న్ పై ఉప్పు, వెన్న, చక్కెర పాకాన్ని చల్లి అమ్ముతుంటారు. అవి రుచిగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే బయట కొనుక్కునే కన్నా ఇంట్లోనే తయారు చేసుకోవడం మంచిది . ఎలాంటి రుచులను కలపకుండానే నేరుగా తినడమే ఉత్తమమైన మార్గం. పాప్ కార్న్ ను రుచి  మాత్రమే కాదు.. ఇందులో ఎక్కువుగా పోషకాలు కూడా ఉంటాయి. \

►ALSO READ | పిల్లలకు లంచంగా ..స్క్రీన్ టైం ఇస్తున్నారా.?