పిల్లలకు లంచంగా ..స్క్రీన్ టైం ఇస్తున్నారా.?

పిల్లలకు లంచంగా ..స్క్రీన్ టైం ఇస్తున్నారా.?

చిన్ని మనసును అర్థం చేసుకుని అడిగింది చేసి పెట్టడం అంటే మామూలు విషయం కాదు. అయితే మోడర్న్​ పేరెంట్స్ పిల్లల్ని ఈజీగా పెంచేస్తున్నారా? అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఫోన్ లేదా ఏదో ఒక స్క్రీన్​ అలవాటు చేయడం. వాళ్లను అలా ఒంటరిగా స్క్రీన్​కి వదిలేసి తమ పనులు చక్కబెట్టుకోవడం, ప్రతి చిన్న దానికి లంచంగా స్క్రీన్ టైం ఆశ చూపడం వంటివి చేస్తున్నారు. దీనివల్ల పేరెంట్స్​ రిలాక్స్​ అవుతున్నారు. కానీ, పిల్లల మానసిక, శారీరక ఎదుగుదల అక్కడే ఆగిపోతుందని గ్రహించట్లేదు. స్క్రీన్ ఆశ చూపడం లంచంగా పరిగణిస్తున్నారు పిల్లల మనసెరిగిన పీడియాట్రిషన్లు. 

ఒకటి నుంచి మూడు సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య స్ర్కీన్ బ్రైబ్. నిజానికి ఇదొక ట్రాప్​. పిల్లలకు ఫుడ్ తినిపించడానికి స్క్రీన్ చూపిస్తున్నారు. స్నానం చేయించాలన్నా, రెడీ చేయాలన్నా వాళ్లు మాట వినకపోతే స్క్రీన్ ఆశ చూపిస్తున్నారు​. పిల్లలు అడిగింది వెంటనే ఇవ్వకపోయినా, చేయకపోయినా, కాసేపు ఆగమన్నా వినరు, వెంటనే ఏడుస్తారు. అప్పుడు వాళ్ల ఏడుపును ఆపేందుకు తల్లిదండ్రులు చేసే పని మొబైల్​ ఫోన్​ లేదా ట్యాబ్​ చేతికి ఇవ్వడం. దీన్నే స్క్రీన్ బ్రైబ్​ అంటారు. ‘ఈ పని చేస్తే స్క్రీన్ ఇస్తాను’ అనడం, ‘ఏడుపు ఆపడానికి స్క్రీన్​ చేతికి ఇవ్వడం’ వంటివి. 
అయితే పిల్లల ఏడుపు ఆపడానికి లేదా వాళ్లతో పనిచేయించడానికి ఇది టెంపరరీ సొల్యూషన్ మాత్రమే. కానీ, తర్వాత ఇదే అలవాటైపోతుంది. ప్రతి చిన్న దానికి పిల్లలు స్క్రీన్ కావాలని డిమాండ్ చేస్తారు.

 లంచం (బ్రైబ్​) లేకుండా ఏమీ చేయడు. ఇలా చేయడం వల్ల పిల్లల్లో మానసిక అభివృద్ధి, ఎమోషనల్ బ్యాలెన్స్, సెల్ఫ్​ మోటివేషన్, సోషల్ స్కిల్స్, ఫిజికల్ యాక్టివిటీస్ ఆడే సామర్థ్యం, లాంగ్వేజ్ స్కిల్స్, రియల్​ వరల్డ్ ఎక్స్​పీరియెన్స్​ వంటివి ఉండవు. వీటన్నింటినీ స్క్రీన్ దొంగలిస్తున్నట్టే. ముఖ్యంగా పిల్లలు స్క్రీన్ ఎక్కువగా చూస్తుంటే భాష నేర్చుకోవడం లేట్​ అవుతుంది. ఫోకస్ తగ్గుతుంది. ఎమోషన్స్​ని కంట్రోల్ చేసుకోలేకపోతారు. స్క్రీన్​ తీసేస్తే పెద్దగా ఏడుస్తారు. దీనివల్ల డిపెండెన్సీ అలవాటవుతుంది. ఇలా చేయడం వల్ల తల్లిదండ్రులు పిల్లలకు ప్రతిసారీ లంచం ఇవ్వాల్సి వస్తుంది. లంచం కోసమే మాట వినేలా తయారవుతారు. లాంగ్​రన్​లో పిల్లల్ని పెంచడం తల్లిదండ్రులకు కష్టమవుతుంది. కాబట్టి లంచం ఇవ్వడానికి బదులు ముందే నిర్ణయించి, పని పూర్తయ్యాక రివార్డ్ ఇవ్వాలి. ఉదాహరణకు ఫుడ్ కంప్లీట్ చేస్తే కథ చెప్తాను, పాట పాడతాను వంటివి. ఓపికతో బౌండరీస్​ సెట్ చేయాలి. వాళ్లు ఏడుస్తున్నప్పుడు నెమ్మదిగా ఆలోచించి ఎమోషన్స్​ని గుర్తించి సపోర్ట్ ఇవ్వాలి. స్క్రీన్​ టైం తగ్గించాలి. రెండేళ్లలోపు పిల్లలకు దాదాపు జీరో స్క్రీన్​, రెండు నుంచి ఐదేండ్ల పిల్లలకు ఒక గంట కంటే తక్కువసేపు ఇవ్వాలి. అది కూడా తల్లిదండ్రులతో కలిసి చూడడం బెటర్. ముఖ్యంగా పిల్లలు బయట ఆడుకోవడానికి, పుస్తకాలు చదవడానికి ప్రోత్సహించాలి. ఇవి వాళ్ల ఎదుగుదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.