సర్కార్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు సౌకర్యాలు లేవ్

సర్కార్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు సౌకర్యాలు లేవ్

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలలో నెలకున్న గందరగోళంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు 4 లక్షల 60 వేల మంది విద్యార్థులు రాస్తే..  రెండు లక్షల 36 వేల మంది ఫెయిల్ అయ్యారని అన్నారు. సర్కార్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు సౌకర్యాలు లేవన్నారు. స్మార్ట్ ఫోన్ లు, ట్యాబ్ లు లేక.. ఇంటర్ నెట్ లేక చదువులు సాగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఫెయిల్ అయ్యామని మానసికంగా బాధపడి చనిపోతున్నారని అన్నారు. అయినా కూడా ప్రభుత్వం పట్టనట్టు ఉందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ స్పందించి విద్యార్థులకు న్యాయం చేయకుంటే. 10వేల మంది విద్యార్థులతో ఇంటర్ బోర్డు ముట్టడిస్తామని హెచ్చరించారు. 

తెలంగాణ రైతులను అవమానిస్తున్రు

క్రికెట్ కు గుడ్ బై చెప్పిన భారత టాప్ వెటరన్ స్పిన్నర్