తెలంగాణ రైతులను అవమానిస్తున్రు

తెలంగాణ రైతులను అవమానిస్తున్రు

తెలంగాణలో  వానాకాలంలో పండిన వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలని కోరేందుకు ఢిల్లీకి వచ్చామన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కేంద్రం చెప్పిన 60 లక్షల టన్నుల టార్గెట్ ముగిసిందన్నారు.  తెలంగాణలో ధాన్యం కొనుగోలు సెంటర్లు నడుస్తున్నాయని.. ఇకపై  వచ్చే వడ్లను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తదన్నారు. వానాకాలంల  పండిన 60 లక్షల టన్నుల వడ్లను కొనుగోలు చేసి రాష్ట్రమే డబ్బులు ఇస్తుందన్నారు. ఒక వేళ కేంద్రం వీటిని తీసుకోకపోతే ఢిల్లీలో ఇండియా గేట్ ఎదురుగా పోస్తమన్నారు. కేంద్రం రైతులను అవమానిస్తుందన్నారు. ఇన్ని రోజులుగా ఢిల్లీలో కూర్చున్నా ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదన్నారు.  ధాన్యం కొనుగోలు విషయంలో మరోసారి ఆలోచించి క్లారిటీ ఇవ్వాలన్నారు. తెలంగానలో వానాకాలంలో పండిన మొత్తం వడ్లను కేంద్రం కొంటుందని.. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, పియూష్ గోయల్ మాటిచ్చారు.అయినా ఇంకా దానిపై స్పష్టత ఇవ్వలేదన్నారు.