హాలియా, వెలుగు: నాగార్జునసాగర్ నియోజకవర్గంలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అటవీ భూముల సమస్యలను పరిష్కరించి, సాగు చేసుకుంటున్న పేద రైతులకు త్వరితగతిన డి-ఫామ్ పట్టాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి కోరారు.
శనివారం విజయ విహార్‌లో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్‌తో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డితో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 30 ఏండ్లగా భూములను నమ్ముకున్న రైతులకు న్యాయం చేయాలని, అసైన్‌మెంట్ భూముల పంపిణీని వేగవంతం చేయాలని సూచించారు.
