కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి ఓ లిల్లీపుట్

కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి ఓ లిల్లీపుట్

తెలంగాణ: సీఎం కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి ఓ లిల్లీపుట్ అని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్.. ప్రధానమంత్రిని కలిస్తే కూడా తప్పుగా మాట్లాడుతున్నాడని ఆయన ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి మాటలు చూస్తుంటే.. ఆయనకు రేబిస్ సోకిందేమోనని అనిపిస్తుందని జీవన్ రెడ్డి అన్నారు. జీవన్ రెడ్డి గురువారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు.
 
సీఎం కేసీఆర్ ఢిల్లీలో వారం రోజులు ఉంటే రాష్ట్రంలో ప్రతిపక్షాలకు నిద్ర పట్టడం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రిని  ముఖ్యమంత్రులు ఎందుకు కలుస్తారో తెలియకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్.. గోబెల్స్ ప్రచారానికి, గాసిప్స్‎కు అడ్డాగా మారిందని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.