పేదల మేలుకే సన్నబియ్యం పంపిణీ : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

పేదల మేలుకే సన్నబియ్యం పంపిణీ : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్టేషన్​ఘన్​పూర్​(జఫర్​గఢ్​), వెలుగు: ప్రజాసంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్​ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారు. జనగామ జిల్లా జఫర్​గఢ్​ తహసీల్దార్​ ఆఫీస్​లో బుధవారం ఆయన కలెక్టర్​ రిజ్వాన్​భాషా షేక్​తో కలిసి రేషన్​ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలు కడుపునిండా అన్నం తినాలని ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందన్నారు. 

అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్​ కాలేజీలో మొక్కలు నాటారు. అంతకుముందు మండల పరిధిలోని కూనూరులో రూ.2.5 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డు, తిడుగు గ్రామంలో రూ.35లక్షల ఈజీఎస్​నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు, ఓపెన్​జిమ్​ను ఎమ్మెల్యే కడియం ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్ రోహిత్​సింగ్, ఏఎంసీ చైర్​పర్సన్​ జూలుకుంట్ల లావణ్యాశిరీశ్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.