స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి.. 21 నెలల్లో రూ.1,026 కోట్ల అభివృద్ధి పనులు : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి.. 21 నెలల్లో రూ.1,026 కోట్ల అభివృద్ధి పనులు :  ఎమ్మెల్యే కడియం శ్రీహరి

జనగామ, వెలుగు : గడిచిన 21 నెలల్లో స్టేషన్​ఘన్​పూర్​ నియోజకవర్గానికి రూ.1,026 కోట్ల అభివృద్ధి నిధులు తెచ్చానని, వచ్చే మూడేండ్లలో మరో రూ.2 వేల కోట్లను తెచ్చి అభివృద్ధి చేస్తానని నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం ఆయన లింగాల ఘన్​పూర్​ మండలం నెల్లుట్లలోని కేబీఆర్​ఫంక్షన్ హల్లో 67 మంది కల్యాణలక్ష్మి, 32 మంది సీఎంఆర్ఎఫ్​​లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.

 అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమానికి కాంగ్రెస్​ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన రోజు నుంచి నేటి వరకు మంజూరు అయిన పనుల వివరాలను ప్రజల ముందు పెట్టానన్నారు. లింగాల ఘన్​పూర్ మండలంలోని ప్రతీ గ్రామానికి గోదావరి జలాలు అందాయన్నారు. వచ్చే శ్రీరామ నవమి లోపు జీడికల్ రోడ్డు పనులు పూర్తి చేయడంతోపాటు జీడికల్ చెరువును గోదావరి జలాలతో నింపుతానన్నారు.