బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ వాళ్లను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ వాళ్లను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు :  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  • దోపిడీ, కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం: రాజగోపాల్‌‌‌‌ రెడ్డి
  • పేరు, డబ్బు కోసమే కేసీఆర్ భారీ నిర్మాణాలు చేపట్టారని విమర్శ

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ వాళ్లని ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల పేరు చెప్పి దోపిడీ చేశారని మండిపడ్డారు. కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనతో ప్రజలకు చాలా నిజాలు తెలిశాయన్నారు. గ్రావిటీ ద్వారా నీళ్లొచ్చే ప్రాణహిత -చేవెళ్లను పక్కనబెట్టి కాళేశ్వరం చేపట్టార ని తెలిపారు. అసెంబ్లీలో నీటి పారుదల శాఖపై శ్వేత పత్రం విడుదల సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. పేరు, డబ్బు కోసమే కేసీఆర్ భారీ నిర్మాణాలు చేపట్టారని, అందులో భాగంగానే సచివాలయం, యాదాద్రి ఆలయం కట్టారన్నారు.

కేసీఆర్‌‌‌‌‌‌‌‌ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ముందు మంత్రులకు కూడా మాట్లాడే అధికారం ఉండేది కాదన్నారు. నల్గొండ జిల్లాకు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయం ఇంకె వరూ చేయలేదని చెప్పారు. కుర్చీ వేసుకొని నల్గొండ జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేస్తానన్న కేసీఆర్‌‌‌‌‌‌‌‌ మాటలను ఆయన గుర్తుచేశారు. 80 శాతం పూర్తయిన బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టును గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం పక్కకు పెట్టిందన్నారు.

మిగతా 20 శాతం పనులు పూర్తి చేసుంటే లక్ష ఎకరాలకు నీళ్లు వచ్చేవన్నారు. డిండి ఎత్తిపోతల పథకం కింద చేపట్టిన ప్రాజెక్టులను పట్టించుకోకపోవడంతో మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలు కరువు ప్రాంతాలుగా మారాయన్నారు. దీంతో ఈ 2 నియోజకవర్గాల్లోని ప్రాజెక్టులను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తనది కాంగ్రెస్ రక్తమని.. కాంగ్రెస్ కుటుంబమని చెప్పారు. తాగుబోతు తెలంగాణను బంగారు తెలంగాణగా కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి చూపిస్తుందని పేర్కొన్నారు.

లోక్ సభ ఎన్నికల్లో 10 సీట్లు గెలుస్తం

లోక్​సభ ఎన్నికల్లో తాము కచ్చితంగా 10 సీట్లు గెలు స్తామని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. 3 సీట్లు బీసీలకు ఇవ్వాలని అనుకుంటున్నామని.. సికింద్రాబాద్, జహీ రాబాద్​తో పాటు భువనగిరి సీటు కూడా బీసీకి ఇవ్వాలని.. గెలిపించుకుంటామని ఆయన పేర్కొన్నారు. పటేల్ రమేశ్​ రెడ్డికి నల్గొండ ఎంపీ సీటు ఇస్తమని  ఏఐసీసీ హామీ ఇచ్చినట్లు తెలుసని ఆయన అన్నారు.