విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలి : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలి : ఎమ్మెల్యే కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి
  •     ఎమ్మెల్యే కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి
  •     రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు ప్రారంభం

చౌటుప్పల్  వెలుగు: విద్యార్థులు ఆటల్లో రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచించారు. చౌటుప్పల్ మండలంలోని పంతంగి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 69వ పాఠశాల క్రీడా సమాఖ్య రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలను ఆదివారం ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. క్రీడల్లో పాల్గొంటే శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారని పేర్కొన్నారు. 

పంతంగి ఉన్నత పాఠశాలలో రాత్రిపూట క్రీడల నిర్వహణకు లైటింగ్​ఏర్పాటు చేయాలని స్థానిక కాంగ్రెస్​ నాయకులు కోరగా.. వెంటనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జ గ్రామంలో రూ.30 లక్షలతో నిర్మించిన పీఏసీఎస్ గోదాంను ప్రారంభించారు. 

రూ.20 లక్షలతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర భవనానికి శంకుస్థాపన చేశారు. నారాయణపురం, చౌటుప్పల్ మండల కేంద్రాల్లో మహిళలకు ఇందిరమ్మ చీరలు అందజేశారు. సర్వేలు గురుకుల పాఠశాలలో మద్ది నారాయణ రెడ్డి, పీవీ నరసింహారావు విగ్రహాలను సీఎస్​ రామకృష్ణారావు, కలెక్టర్ హనుమంతరావుతో కలిసి ఆవిష్కరించారు.

గోదాం నిర్మాణ పనులకు శంకుస్థాపన 

చండూరు, వెలుగు: చండూరు మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం ఆవరణలో రూ.38.26 లక్షలతో నిర్మించనున్న గోదాం పనులకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం చండూరు పట్టణంలో రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు.