రాజగోపాల్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు?

రాజగోపాల్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు?
  • వ్యవహార శైలిపై కాంగ్రెస్‌ సీరియస్‌
  • ఓరాకు, క్రమశిక్షణ కమిటీకి కుంతియా సిఫార్సు
  • మూడు,నాలుగురోజుల్లో నిర్ణయం?

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు వేయాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. రాజగోపాల్‌ వ్యవహార శైలిపై సీరియస్‌గా ఉన్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా అతన్ని సస్పెండ్‌ చేయాలని ఏఐసీసీ యాక్టింగ్‌ ప్రెసిడెంట్‌ మోతీలాల్‌ ఓరా, డిసిప్లనరీ కమిటీకి సిఫార్సు చేసినట్టు సమాచారం. రాష్ట్ర పార్టీ నేతలూ రాజ్‌గోపాల్‌పై ఏఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీనిపై మూడు, నాలుగు రోజుల్లో నిర్ణయం వెలువడొచ్చని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఖతమైందని, బీజేపీకే భవిష్యత్తు ఉందని ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాజ్‌గోపాల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఉత్తమ్‌ నయం కుంతియా వేస్ట్‌’ అన్నారు. గతంలోనూ కుంతియా వల్లే పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని పలు మార్లు ఆరోపించారు. రాష్ట్ర పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా కూడా
మాట్లాడారు.