
వేములవాడ ఓటర్ల జాబితా నుంచి మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పేరును తొలగించారు అధికారులు. పేరు తొలగిస్తూ రమేష్ ఇంటి గేట్ కు నోటీస్ అంటించారు. అధికారులు.
చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదని గతంలో స్పష్టం చేసింది హైకోర్టు. హైకోర్టు తీర్పు ఆధారంగా చెన్నమనేని రమేష్ పేరును ఓటర్ లిస్టు నుంచి తొలగించాలని అధికారులను కోరారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఓటర్ లిస్టులో పేరు తొలగింపు పైన జూన్ 24న రమేశ్ కు నోటీసులు ఇచ్చారు అధికారులు. ఏమైనా అభ్యంతరాలుంటే జులై 2 వరకు చెప్పాలని సూచించారు. అయితే ఇంత వరకు అధికారుల నోటీస్ కు సమాధానం ఇవ్వలేదు చెన్నమనేని రమేష్. దీంతో రమేష్ పేరును ఓటర్ లిస్టు నుంచి తొలగించారు అధికారులు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత పేరును ఓటర్ లిస్టు నుంచి తొలగించడం దేశంలోనే మొదటి సారి కావడం విశేషం.